సోమశిల నుంచి అక్కమహాదేవి గుహలను సందర్శించి, తెలంగాణ తీరంలోని శ్రీశైలం డ్యామ్‌వరకు బోటింగ్ సౌకర్యం కల్పించడంపై టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టూరిజంశాఖ అధికారులు కూడా సంతోషం వ్యక్తంచేశారు. సోమశిలప్రాంతంలో టూరిజం సదుపాయాలను పెంచిన తర్వాత పర్యాటకుల నుంచి వస్తున్న స్పందనలను, సదుపాయాలను మంత్రులు సమీక్షించారు. రాష్ట్ర పరిధిలోని సోమశిల ప్రాంతమంతా ఆహ్లాదంగా పర్యటించేవిధంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసిన ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అక్కమహాదేవి గుహలు, పర్యావరణ టూరిజం పరిధిలోకి వస్తున్నందున అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
సోమశిల అటవీప్రాంతం పులలు సంరక్షణ ప్రాంతంగా కూడా ఉన్నదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కమహాదేవిగుహల సందర్శనకు వచ్చేవారి నుంచి తీసుకునే రుసుములో అటవీశాఖకు కూడా కొంత చెల్లించాలని చర్చ వచ్చింది. ఆదాయవనరులు పెరుగుతాయని , అటవీ పరిరక్షణ, నీటిపారుదల, దేవాదాయశాఖ చట్టాలను పరిగణనలోకి తీసుకొని శాఖల నుంచి అనుమతులు తీసుకున్నామని, ఏకకాలంలో ఈ ప్రాంతంలో పర్యావరణ, యాత్రా, జలవిహారం వంటి ఆహ్లాదకరమైన అంశాలన్నీ ఉన్నందునే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వివరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి