హైదరాబాద్ లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అవసరమయ్యే సమగ్ర నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దాదాపు 12వేల ఎకారాల్లో ఫార్మా పరిశ్రమలతో పాటు ఫార్మా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఫార్మా పరిశ్రమల వల్ల కాలుష్య సమస్యలు రాకుండ పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యర్థాల ట్రీట్మెంట్ సరిగా జరగడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉండే అమెరికా, జపాన్, యురప్ దేశాలలో పర్యటించి అక్కడ వ్యర్థాల సమగ్ర నిర్వాహణ కోసం అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. సిఎంఓ అదనపు ముఖ్యకార్యదర్శి శాంతకుమారి నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్ లో నెలకొల్పే ఫార్మాసిటీపై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫార్మాసిటీ నూటికి నూరు శాతం ప్రమాద రహితంగా, వ్యర్థాలు బయటికి వచ్చే వీలు లేకుండా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో నగరంలో నెలకొల్పిన ఫార్మా పరిశ్రమల వల్ల కొన్ని ప్రాంతాలు పూర్తిగా కలుషితం అయిపోయ్యాయని ఈ పరిస్థితి పునరావృతం కావద్దని సూచించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి