కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ తో కే సీ ఆర్ విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కమ్)ను నష్టాల ఊబి నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉదయ్ (Ujwal DISCOM Assurance Yojana) పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. డిస్కమ్ లకు ఉన్న అప్పులను తీర్చడం ద్వారా వాటిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు. డిస్కమ్ ల అప్పులు తీర్చడానికి నిధులు సమీకరించుకోవడానికి ఎఫ్.ఆర్.బి.ఎమ్. మినహాయింపులు ఇవ్వడం సానుకూల అంశమని సిఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఉదయ్ పథకంలో చేరాలని సిఎంను కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలగా స్పందించారు. ఉదయ్ లో చేరడం ద్వారా జరిగే పరిణామాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దీన్ దయాల్ పథకంలో ఎక్కువ నిధులు ఇవ్వడంతో పాటు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించడానికి కేంద్ర మంత్రి అంగీకరించారు. తెలంగాణ ఉదయ్ పథకంలో చేరాలని నిర్ణయించినందువల్ల కేంద్ర, రాష్ట్ర అధికారులు మరోసారి సమావేశమై ఒప్పందంపై సంతకాలు చే...