ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలంగాణా కొత్త రాష్ట్రం

తెలంగాణా  కొత్త రాష్ట్రంగా జూన్ 2 వ తేదిన ఏర్పదబోతుంది . మొత్తం 35 మిలియన్ జనాబా కల్గిన రాష్ట్ర0 , కె సి ఆర్  మొట్ట మొదటి ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు . పల పిట్ట తెలంగాణా పక్షిగా ,కాకతీయ తోరణం  ,చార్మినార్, అశోక చిహ్నం తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ భాషల్లో తెలంగాణా లిఖించబడిన లోగో  కె సి అర్ అనుమతి తో ఆమోదించారు. అవిబ్బవ వేడుకలు ఘనగా చేయాలనీ ,దానికి సంబంధించన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరిగినట్లు తెలుస్తుంది  

చంద్ర ఢిల్లీ పర్యటన -కోరిన హామీలు

టిడి పి  అధినేత చంద్ర బాబు నాయుడు ఢిల్లీ లో ప్రధాని తో సహా అరుణ్ జైట్లీ , ఉమా బారతి కలిపి 12 మంది మత్రులను  కలిసారు . ఆంధ్ర ప్రదేశ్ అభిరుద్ధి కు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మూడు నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేయాలనీ నరేంద్ర మోడీ ని కోరారు .  జూన్ 8న జరిగే చంద్ర బాబు ప్రమాణ స్వీకరణ ఉత్సవానికి రావాలని నరేంద్ర మోడీ కోరినట్లు తెలుస్తుంది ఆంధ్ర ప్రదేశ్ సంబందించిన 13 వేల కోట్ల రెవెన్యు  లోటును కేంద్రమే బర్తీ  చేయాలనీ ,రాష్ట్రo లోని 13 జిల్లాలకు ప్రత్యెక హోదా కల్పించాలని  విన్న పించారు  హైదరాబాద్ చెన్నై కు తాగు నీటి అవసరాలకు నీరును కేటాయించిన విధంగా ఆంధ్ర ప్రదేశ్రా కొత్త రాజధానికి 30 టి ఎం సి ల నీరు ను అందించాలని కోరారు 

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్

పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుతూ కేంద్రం అర్దినన్సు జారీ చేయటాన్ని నిరసిస్తూ తెలంగాణా బంద్ కు కే సి అర్  పిలుపునించారు . స్వచందంగా వ్యాపారస్తులు ,వాణిజ్య సంస్థలు బంద్ కు మద్దతిఛ్చ్ యి 

పోలవరం రభస

  పోలవరం  రభసకు దారి తీసే పరిస్థితి  నెలకొంది. కేంద్రప్రభుత్వం  నరేంద్రమోడీ ఆధ్వర్యంలో    రాష్ట్ర విభజన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు  ప్రయత్నిస్తుంది .  పోలవరం పై కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ కు సిద్దముతున్న తరుణం లో  గురువారం కే సీ అర్   తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. - ఇదివరకే యూ  పీఏ హయం లో ఖమ్మం 9 మండలాలను  ఆంధ్ర రాష్ట్రము లో కలపాలని నిర్ణయించింది . జూన్ 2 వ తేది అపాయింట్ డే ఉండటంతో నరేంద్ర మోడ్ సర్కార్ ఈ విషయం లో ఆర్డినెన్సు  జారి చేయవలసి వస్తుంది . చంద్ర బాబు తన వాదనను వేనిపించెందుకే ఢిల్లీ పయనం అవుతున్న్నారు  .

నరేంద్ర మోడీ సర్కారు అవినీతి ఫై పోరాటం

దేశంలో సంపన్ను దాచుకున్న అవీనితి సొమ్మును వెలికి తీసే ప్రయత్నం నరేంద్ర మోడీ సర్కారు మొదలుపీటింది మొదటి సారి బేటీ అయిన కేంద్ర కాబినెట్ ఈ నిర్ణయం ప్రకటించింది . ఈ నెల 29 లోపు సిట్ ను ఏర్పాటు చేయాలన్న సుప్రేం కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా సిట్ ను ఏర్పాటు చాయాలని కాబినెట్ నిచ్చైన్చింది . 

ఎన్నికల్లో పార్గొన్న పార్టీ ల వివరాలు

Year Party Type Registered Participated 2004 జాతీయ  పార్టీలు  6 6 రాష్ట్ర పార్టీలు  56 36 గుర్తింపు లేని పార్టీలు  702 173 మొత్తం గుర్తింపు పొందిన పార్టీలు  764 215 2009 జాతీయ  పార్టీలు  7 7 రాష్ట్ర పార్టీలు  39 34 గుర్తింపు లేని పార్టీలు  1014 322 మొత్తం గుర్తింపు పొందిన పార్టీలు  1060 363 2014 జాతీయ  పార్టీలు  6 6 రాష్ట్ర పార్టీలు  47 39 గుర్తింపు లేని పార్టీలు  1634 419 Total Registered Parties 1687 464

చంద్ర బాబు ప్రమాణ స్వీకారం జూన్ 8

చంద్ర బాబు ప్రమాణ స్వీకారం జూన్ 8 వ తేది న గుంటూరు విజయవాడ రహదారి మధ్య నాగార్జున యూనివర్సిటీ కి దగ్గర్లో ఇంతకు ముందు యవ గర్జన నిర్వహించిన చోటు జరగనున్నట్లు సమాచారం . పోలీస్ బలగాలను తరలిస్తున్నారు . భారి బందోబస్తు మధ్య ప్రమాణ స్వీకారం జరగబోతుంది 

నేడు నరేంద్రుడి ప్రమాణ స్వీకారం

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రధాన మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు .. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ,శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్షే ,మరిశాష్ ప్రధాని నవీన్ చంద్ర,ఆఫ్గనిస్తాన్ అద్యక్షుడు హమిద్ కర్జాయి ,భూటాన్ ప్రధాని షేరింగ్ ,నేపాల్ ప్రధాని శుషిల్ కొయిరాలా,మాల్దివుల అద్యక్షుడు అబ్దుల్ గయ్యుం రానున్నారు ఎన్ డి ఏ ,బాజపా మిత్రపక్షాలతో కలుపుకొని 30 నుంచి 35 మంది ప్రమాణం చేసే అవకాశముంది . ఈ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ కాకుండా భవన్ ప్రాంగణం లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు

జె సి దివాకర్ రెడ్డి నరేంద్ర మోడీ తో భేటి

జె సి  దివాకర్ రెడ్డి నరేంద్ర మోడీ తో ఢిల్లీ లో కలసినట్లు సమాచారం . మోడీ సర్కారు లో దివాకర్ రెడ్డి కి మంత్రి పదవి లబించే అవకాశముందని భావిస్తున్నారు 

శాంతి భద్రత లు కాపాడాలి :చంద్రబాబు

శాంతి భద్రతల సమస్య ను  ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి  సృష్టించరాదని    టిడిపి అధినేత, ఆంధ్ర ప్రదేశ్  సి.ఎమ్. చంద్రబాబు నాయుడు చెప్పారు .ఇక నుంచి  కెసిఆర్ రెచ్చకొట్టే  ప్రసంగాలు మానుకోవాలని ఆయన  సూచించారు 

రుణ హామీ -రూ. 80 వేల కోట్లు

  చంద్రబాబు ఇచ్చిన  రుణమాఫీ వల్ల ఆర్థిక వ్యవస్థ    చిన్నాభిన్నం అవుతుందని   ఎపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.ఓట్లు పొందినందున రుణ హామీ నెరవేర్చాలని  రఘువీరారెడ్డి    డిమాండ్ చేశారు.  రుణమాఫీ చేయాలంటే  రూ. 80 వేల కోట్లు అవసరమవుతాయని  ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎం సెట్ ప్రవేశ పరిక్షలు ఉదయం 10 గంటలకు ప్రారంబం

ఈ పరీక్షకు 2,82,700 మంది,500 పరీక్షా కేంద్రాలలో పరీక్షా రాసినట్లు   సమాచారం  

భుకంపo తో పరుగులు తీసిన జనం

దేశం లో పలు ప్రాంతాలలో భూమి కంపించిందని,రాత్రి 11 గంటల కు చెన్నై,ఉత్తర తూర్పు ప్రాంతాలలో భూమి స్వల్పంగా కంపించింది, రిక్టర్ స్కేల్ ఫై 6. 0 గా నమోదయింది . ఇది బంగాళాఖాతంలో కేంద్రియంగా 60 కిలోమీటర్ల దూరంలో 10 మీటర్ల లోతులో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు .సముద్రo లో ఏర్పడటంతో సునామి వస్తుందని ప్రజలు భయపడతంతో ,దీని తిర్వ్రత అంతలేదని బయపదవలసిన్దిలేదని వాతావరణ శాఖ వెల్లడించింది 

ఎన్డీయే కన్వీనర్ పదవి టి డి పి దే ?

బి జె పి  పూర్తి మెజారిటీ పొందటం తో కన్వీనర్ పదవి టి డి పి పదవి దక్కే అవకాశం తక్కువే .. బి జె పి  లో ఉన్న సీనియర్ నాయకులనే ముప్పతిప్పలు పెట్టిన మోడీ టి డి పి కు లోన్గుతడా ? .. బి జె పి  ధీర్గకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంటె ఆ పదవి వరించె అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయి లో చంక్రం తిప్పే అవసరం ఉంటుందని భావించిన టి డి పి నేతలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు . 

రాజధాని రేసులో గుంటూరు

మౌలిక సదుపాయాలతోపాటు ఇటు రాయలసీమకు కోస్తాంధ్రకు మధ్యలో ఉండటంతో పాలకుల దృష్టి ని ఆకషిస్తుంది.  రెండు ప్రాంతాల మధ్య ఉన్న మంగళగిరిని రాజధాని కావాలంటూ  పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ఈనేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ  ప్రాంతాన్ని పరిపాలనా భవనంగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా రాజధానికి అనువైన ప్రాంతాన్ని వెతికే క్రమంలో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలను ఇప్పటికే ఒక దఫా అధికారుల బృదం పరిశీలించింది కూడా. ఐదో నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉండడం, కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టుకు 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంరాజధానికి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.