ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

మద్యం లైసెన్స్లకు కొత్త జీ వో

రాష్ట్రంలో మద్యం టెండర్ల ప్రక్రియను సవరిస్తూ కొత్త జీ వో  ను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ జీ వో ప్రకారం ఏడాది పాటు మాత్రమే లైసెన్స్ ఇస్తారు.ప్రతి పది వేల జనాబాకు 32 అక్షాల రూపాయలు  యాబాయ్   వేల జనాబా కు ముప్పై నలుగు లక్షలు , మూడు లక్షల జనాబా కు నలబ్యే రెండు లక్షలుగా లైసెన్స్ ను ప్రబుత్వం నిర్ధారించింది .యస్సీ ఎస్టీ  అభ్యర్ధులకు ఆ ప్రదేశం వారికే కేటాయించాలని,మద్యం  ఎం ఆర్ పీ  ప్రకారం మే అమ్మాలని నిర్ధారించింది.కొత్త జీ వో ద్వార మద్యం  సిన్డికేట్ ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది 

ఆర్ టీ ఎ తనిఖీలు

శుక్లవరం ఓ ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు షిర్డీ కు వెళుతూ మహారాష్ట్ర వద్ద ప్రమాదానికి గురియైంది.రాష్ట్రంలో పలు చోట్ల ప్రైవేటు యాజమాన్యం నడుపుతున్న బస్సు లు తరచూ ప్రమాదాలకు గురవుతుండడం తో రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అథారిటీ మేలుకొని ప్రైవేటు నిర్వహిస్తున్న బస్సు సర్విసుల ఫై  తనిఖీలు చేపట్టింది.ఇది కేవలం హడాహుడి ప్రత్నామా లేక నిజంగానే చేస్తుందా ...ఇప్పటి వరకు ఎన్ని ఘటనలు చోటు చేసుకున్న మేలుకొని ఆర్  టీ ఎ ఇప్పుడు ఉన్నట్లుండి తనిఖిల ప్రక్రియ చేపట్టింది. నిజంగా చిత్తసుద్ధి ఉంటె రాష్ట్రము లో ఇలాంటి ప్రమాదాలు కొన్నయిన ఆప గలిగేది.

ఉప ఎన్నికల ఫలితాల ఫై విశ్లేషణ

తాను ముందే చప్పిన విధంగా ఫలితాలు వచ్చాయని....జగన విజయం కేవలం సెంటిమెంట్ వలనే వచ్చిందని ఇది పొంగు లాంటిదని 2014 ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ పనిచేయదని విజయమ్మ జనం లో తిరిగి కన్నీళ్ళు పెట్టినందు కే ఈ సెంటిమెంట్ బాగా పనిచేసిందని ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి చెప్పారు.

పత్రికల మొదటి పేజి

వై ఎస్ ఆర్ కాంగ్రెస్  విజయభేరి విచిన సానుభూతి పవనాలు  శీర్షికతో ముందు పేజిలో  ప్రముఖంగా..... ఏడు చోట్ల కాంగ్రెస్ కు, ఐదు చోట్ల తెలుగుదేశం కు డిపాజిట్లు పోయిన   విషయాలను ఈనాడు  ప్రస్తావించింది .ఆంధ్రజోతి జగన్ తుపాన్...ఉప ఎన్నికలో సానుభూతి ప్రభంజనం మొదటి పేజి లో ప్రచురించింది.సాక్షి జనం గుండెల్లో జగన్ ..కుమ్మక్కు కుట్రను చీ కొట్టిన జనం....అనే శిర్షిక తో ప్రముఖంగా ప్రచురించింది .

ఉప ఎన్నికల ఫలితాల ఫై బిన్న స్వరాలూ

 ఉప ఎన్నికల ఫలితాల ఫై వివిధ పార్టీలు బిన్నంగా స్పందించాయి.ఎన్ని కుట్రలు చేసిన , ఎన్ని ప్రలోభాలు పెట్టిన, గుండాయిజం చేసిన దేనికి తెలంగాణా ప్రజలు లొంగకుండా టి ఆర్ ఎస్ అభ్యర్ధి బిక్షపతిని ఎన్నుకొని తెలంగాణా సెంటిమెంట్ జగన్ సెంటిమెంట్ కంటె ఎక్కువుందని నిరుపించారని,బీజే పీని డిపాజిట్ లేకుండా చేసారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇది దేవుడిచ్చిన తీర్పుగా వై ఎస్ జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యానించారు.ఇటు చంద్ర బాబు నాయుడు జగన్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల కారణంగా వై.ఎస్.ఆర్. విజయం సాధించిందని ఈ ఫలితాలను విశ్లేశుకున్టమని చెప్పారు. అటు కాంగ్రెస్  ఛీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తమకన్నా తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిందని జగన్ అరెస్ట్  తర్వాత జనంలో విజయమ్మ సానుభూతి కోసం ప్రయత్నిచారని  చెప్పారు

కలాం లేదా ప్రణబ్ ముఖర్జీ ....

యుపిఎ  తన రాష్ట్ర పతి అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ పేరును ప్రతిపాదించింది.యు పీ ఎ భాగాసామీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ములాయం తో బేటి అనంతరం కలం పేరు ను ప్రతిపాదిస్తూ,కలామే తన అభ్యర్దని ప్రకటించింది.ఇది ఇలా ఉండగా ఎన్ డి ఎ కూడా కలం పేరును తెర ఫైకి తెచ్చింది.చివరికి ఏకాభిప్రాయం వస్తుందా?లేక యుపిఎ, ఎన్.డి.ఎ. ల మధ్య పోటీ జరుగుతుందా?  కలాం, లేక ప్రణబ్ ముఖర్జీ  రాష్ట్రపతి అవుతారో ఒకటి రెండ్రోజుల్లో తేలుతుంది

ఉప ఎన్నికల ఫలితాలు

వై ఎస్ ఆర్ సి పీ  15 కాంగ్రెస్  2 టీడీ పీ ౦ టీ ఆర్ ఎస్ 1 ఇతరులు ౦ వై ఎస్ ఆర్ సి పీ  15  స్థానాలు గెలవటం  తో  సెంటిమెంట్  బలంగా  పనిచేసిందని విశ్లేషకుల  చెపుతున్నారు .కాంగ్రెస్ పార్టీ పాయకరావుపేట, పోలవరం, పత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, ఎమ్మిగనూరు, రాయదుర్గం, అనంతపురంలలో మూడో స్థానంలో ఉండగా పోలవరం, పత్తిపాడు, మాచర్ల, అనంతపుర, పరకాలలో కాంగ్రెస్  డిపాజిట్లు కోల్పోయింది.రామచంద్రపురం, నరసాపురం, ఆళ్లగడ్డలలో టిడిపికి డిపాజిట్లు ధక్కలేదు.రామచంద్రపురం, నరసాపురం లో కాంగ్రెస్ విజయం సాదించింది.చిరంజీవి తన నియోజక వర్గం లో తన అభ్యర్ధి ని గెలిపించాలేకపోయారు.టీడీ పీ ఒక స్థానం కూడా గెలువ  లేదు

బీ జే పీ, టీ ఆర్ ఎస్ పోటాపోటి సభలు

శనివారం సాయంత్రం రెండు పార్టీల భహిరంగ సభలు పోటాపోటిగా ముగిసాయి.బీ జే పీ హనంకొండ లో భహిరంగ సభ ఏర్పాటు చేస్తే ,,టీ ఆర్ ఎస్  పరకాల లో ఏర్పాటు చేసుకొంది.రెండు పార్టీల ప్రముఖులు ఒకేసారి ఒకేసమయానికి ప్రసంగించడం విశేషం.ఇది అనుకోకుండా జరిగిందిందా లేక వ్యూహాత్మకంగా నడిచిందా ? ఒకే సమయానికి అటు హనంకొండ లో బీ జే పీ లీడర్ సుష్మ స్వరాజ్ ఇటు టీ ఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు వేదిక వద్దకు చేరుకొని ఒకే సమయానికి ప్రసంగం ప్రారంభించారు.మీడియా ఛానల్ లు దేనికి ప్రాముఖ్యత కల్పించాలో తెలియక రెండు ప్రసారం చేసారు .ఇది మీడియా ను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నమా ...బీ జే పీ సభ నుంచి మీడియాను తమ వైపు ఆకర్షించే ప్రయత్నమా? లేక ఇది ఒక యద్రుచికంగా జరిగిందా ? మొత్తానికి రెండు సభ లలో ప్రముఖుల ప్రసంగాలు భాగా సాగాయి.బీ జే పీ సభ లో సుష్మ వేదికను చేరుకొనే ముందు వర్షం రావడంతో సుష్మజి తొందరగా ముగించారు.