ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ ప్రాజెక్టు పూర్తి

రైల్వే బడ్జట్‌ 2007-2208 లో ప్రవేశపెట్టిన   కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తెంది. ఈ రైల్వే లైన్‌ 207 కి.లో. దూరాన్ని 113 కి.లో. కర్ణాటక,94 కి.లో. ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కావసిన భూ సేకరన జరగక.ఆర్ధిక వనరులు లేక కుంటుపడ్డ ప్రాజెక్టు పనులు 2011 సంవత్సరంలో మెదలై ఇప్పటికి ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రైల్వే లైన్‌  ద్వారా  కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ మద్య చిన్నిచిన్న గ్రామాలను కలుపుతు రెండు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యం సాకారమైంది. ఆంద్రప్రదేశ్ నుంచి 810 ఎకరాలు  కావసిఉండగా అందులో 630 ఎకరాలు.,కర్ణాటక నుంచి 1185 ఎకారల అవసం ఉండగా 152 ఎకారలు మాత్రమే సాధ్యమయింది. రైల్వే మినిస్టర్‌ సురేష్‌ ప్రభు .1714 కోట్ల వ్యయంతో చేపట్టిన కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ రైల్వే లైన్‌ వ్యయం రైల్వే 857.25 కోట్లు,ఆంద్రప్రదేశ్‌ 390.17, మరియు కర్ణాటక 467.08 కోట్లు పంచుకున్నాయి.

పైపులైన్‌ గ్యాస్‌ -పదకొండు వందల కుటుంబాలకు లబ్ది

 తూర్పుగోదావరి ,మోరీ గ్రామంలో గ్యాస్‌ పైప్‌ లైన్‌ తో వంట గ్యాస్‌ సరఫరా చేయటానికి  ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం,ఏపీగ్యాస్‌ డిస్ట్రీబూషన్‌ కార్పొరేషన్‌ తో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందంతో మోరీ లోని 1100 కుటుంబాలకు వంట గ్యాస్‌ సరఫరా చేయనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. మోరీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఒఎన్‌జీసీ,గ్యాస్‌ ఆథారిటీ ఆప్‌ ఇండియా సంస్థలకు సంబందించిన గ్యాస్‌ నిక్షేపాలున్నాయి. వీరికి మోరీ ప్రాంతానికి వంట గ్యాస్‌ అందించటం సులువౌతుందని చెబుతున్నారు.

అందరికీ ఒకే న్యాయం: కె. చంద్రశేఖర్ రావు

తెలంగాణ రాష్ట్రంలోని పేదలైన ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి వున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదనే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రిజర్వేషన్లు పెంచే విషయంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాల్సిందిగా సిఎం సూచించారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే విషయంపై అనుసరించాల్సిన వ్యూహం గురించి బుదవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. బీసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, బీసి కమిషన్ చైర్మన్ బిఎస్. రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరిశంకర్, ఆంజనేయులు గౌడ్ ముస్లింల స్థితిగతులపై అధ్యయనం జరిపిన కమిషన్ చైర్మన్ సుదీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, పోలీస్ కమిషనర్ మహెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్న...

2016 లో ...తెలంగాణం

తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడొ ఏడాది దిగ్విజయం కొనసాగుతూ నెంబర్‌ వన్‌ స్టేట్‌ గా నిలబదింది. కేసీఆర్‌ నంబర్‌ వన్‌ సీఎంగా నిలిచారు.ఆ ఏడాది చెపట్టిన పాలనా సంస్కరణలు అతి పెద్ద సంస్కరణలు గా చెప్పవచ్చు. తెలంగాణను  31 జిల్లాలు గా మార్చి ,పరిపాలన సౌలభ్యంతో పాటు,ప్రజల సమస్యలను త్వరితగంగా పరిష్కరించేందుకు  కేసీ ఆర్‌ శ్రీ కారం చుట్టారు. వరుస ఎన్నికల విజయాలతో తిరుగులేని పార్టీగా  తెలంగాణ సమితి అవతరించింది. మెదటి సారి గ్రేటర్‌ హైదరాబాద్‌ మన్సిపల్‌  కార్పోరేషన్‌ లో ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించింది.అటు వరంగల్‌,ఖమ్మం కార్పోరేషన్‌ తో పాటు అచ్చం పేట,సిద్దిపేట్‌,మునిసిపాలిటీల్లో నేగ్గింది. ప్రజల శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీపడకుండా  సైబరాబాద్‌ కమిషనరేట్‌ ను ... సైబరాబాద్‌. రాచకొండ  కమిషనరేట్లగా... సిద్దిపేట్‌, నిజామాబద్‌ ,వరంగల్‌. కరీంనగర్‌ రామగుండంలో పోలీస్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.వివిధ ప్రైవేటు సంస్థలు జరిపిన సర్వేలలో తెలంగాణ ప్రజల  మన్నను కేసీఆర్‌  పొందారని తెల్చాయి.వ్యవసాయ మార్కెట్‌ కమిటిల్లో ఎస్సీ,బీసీ, మహిళలకు రిజర్వేషన...

జలుబే కదా... అని నిర్లక్షం చేస్తే అంతే...

. చలికాలంలో మనం సాదారణంగా ఇబ్బింది పెట్టే వ్యాధి... మాములు వ్యాధి జలుబు... జలుబే కదా పోతుందిలే అనుకుంటే కష్టం..అది ఫ్లూ డా మారితే... పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. తుమ్ములు,ముక్కునండి నీరు కారడం,తీవ్ర జ్వరం,తలనొప్పి,ఒళ్లనోప్పులు,దగ్గు,అలసట వాంతులు ఉండే అవకాశముంది. ఈ లక్షణాలు సాదారణంగా జలుబైతే ఐదు రోజుల వరకు తగ్గిపోతాయి. కానీ అలా కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గకపోవడం,శరీర శక్తి క్షీనించటం కనసాగితే ప్లూ వైరస్‌ సొకిందని గమనించాలి.  ఈ వైరస్‌ ఇతరులకు రోగి తుమ్మునప్పుడు,దగ్గినపుడు గాలి ద్వారా సోకుతుంది. చలికాలంలో ఎక్కువగా ఈ ప్లూ వాప్తి చెందుతుంది. ఇలాంటి ప్లూ లక్షణాలు గమనించి, డీహైడ్రెషన్‌ కాకుండా నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ,గొంతు నొప్పి ఉంటే ..ఉప్పు కలిపిన వేడి నీటితో పుక్కలించాలి. డాక్టర్‌ ను 48 గంటలలోపు సంప్రాదిస్తే,మందులతో  ఈ వ్యాధి తీవ్రత తగ్గించే అవకాశముంటుంది. యాంటివైరల్‌ ముందులు ఒసొల్టోమివీర్‌(టామిప్లూ),పెరమివీర్‌, ఉపసమనం కలిగిస్తాయి. ప్లూను గుర్తించి,వెంటనే డాక్టర్‌ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే  ప్లూ భారీ నుండి ఉపసమనం పొందవచ్చును. ప్లూ సొకకుండా త...

తెలంగాణ సర్కారు కంపాషనేట్ అపాయింట్ మెంట్ జి వో విడుదల

ప్రభుత్వం ఉద్యోగి మారనంతరం ఆ కుటుంబ సభ్యులకు కంపాషనేట్ కెటగిరి లో ఆప్లికేషన్‌ అందిన 10 రోజులలో మరణించిన వ్యక్తి కుటుంబంకు ఉద్యోగం ఇవ్యాలని ఈ జి. వో సూచిస్తుంది.

తెలంగాణ సీఎం దత్తత గ్రామాలు... ఇక నగదు రహితం

ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు నగదు రహిత గ్రామాలుగా మారాయి. ఈరోజు ఎర్రవల్లిలో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, నర్సన్నపేటను నగదు రహిత గ్రామాలుగా ప్రకటించారు. సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్‌ స్ఫూర్తిగా ఇకపై ఈ రెండు గ్రామాలు నగదు రహిత లావాదేవీలకు నమూనాగా మారాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలి చేలా అందరూ కృషి చేయాలన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను నగదు రహిత లావాదేవీలు నిర్వహించేం దుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రెండు గ్రామాల్లోనూ 1200 మందికి ఇప్పటికే డెబిట్‌ కార్డులు అందించామన్నారు. మొత్తం 17 స్వైపింగ్‌ యంత్రాల సాయంతో నగదు లేకుండానే కొనుగోళ్లు జరిగేలా ఏర్పాటు చేశామన్నారు. మొబైల్‌ యాప్‌ల వినియోగం, బ్యాంకుమిత్రల సహకారంతో లావాదేవీలు, అన్ని అంశాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. సిద్ధిపేట నియోజకవర్గం మొత్తాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు....