ఎన్టీఆర్ తాను రాజకీయాలలోకి రానున్నట్టు తొలిసారిగా ప్రకటించింది
1980 సంవత్సరంలో. ఊటీలో 'సర్దార్ పాపారాయుడు' సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో ఒకనాడు, తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తనకు అరవై సంవత్సరాలు వయసు వచ్చాక రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని ఉందనీ, ఇన్నాళ్ళూ తనను ఆదరించిన ప్రజల ఋణం తీర్చుకోవాలని ఉందని అన్నారు. ఆ విషయం కాస్తా ఆ నోటా, ఈ నోటా పడి తెలుగు పత్రికలలోకి రాగానే తెలుగునాట తొలి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ వారి గుండెల్లో దడ మొదలయ్యింది. ఎన్టీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఆబాలగోపాలమూ సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలన అంతమయినట్టే అని భావించిన అధిష్టానం ఎన్టీఆర్ పై సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించింది. ఎన్టీఆర్ బాల్య స్నేహితుడైన భవనం వెంకట్రాంను ముఖ్యమంత్రిని చేసి, ఆయన ద్వారా ఎన్టీఆర్ ను మెత్త పరచేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఎన్టీఆర్ సినిమాలను సెన్సార్ బోర్డులో ఏదో ఒకరకంగా ఆపడం చేశారు. అటు సినీ రంగంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్తారనే వార్త విన్న నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు పోటీ పడ్డారు. ఇదిలా సాగుతుండగా ఎన్టీఆర్ తన సినిమాలను తాను చేసుకుంటూ మరో వైపు రాష్ట్ర రాజకీయాలను పరిశీలించసాగారు.

చివరికి అనుకున్న సుముహూర్తం రానే వచ్చింది.
1982 మార్చి 21న అంటే 34 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున రామకృష్ణా స్టూడియోలోని మినీ ప్రివ్యూ థియేటర్లో జర్నలిస్టుల సమక్షంలో తన రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన చేశారు ఎన్టీఆర్. అంతే ఆ తర్వాత షూటింగ్ నిమిత్తం వెంటనే మద్రాస్ వెళ్ళిపోయారు.
సోర్స్ :టి డి పీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి