మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో జరిగిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ఒప్పందాలను, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులను పరిశీలించడానికి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసుకోవడానికి పరస్పర అంగీకారంతో ఒప్పందం కుదిరింది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్
1979 (తదుపరి నివేదిక 1980) పరిశీలనకు అనుగుణంగా రెండు రాష్ర్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటికి ఈ బోర్డు సర్వ పర్యవేక్షణ సంస్థగా పనిచేస్తుంది.
2. ప్రాణహిత ప్రాజెక్టు (తమ్మిడిహట్టి బ్యారేజి), కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజి)
3. పెన్ గంగపై రాజుపేట వద్ద బ్యారేజి
4. పెన్ గంగపై చనాఖా-కొరాట మధ్య బ్యారేజి
5. పెన్ గంగపై పంపరాడ్ వద్ద బ్యారేజి
6. లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు
3. పెన్ గంగపై రాజుపేట వద్ద బ్యారేజి
4. పెన్ గంగపై చనాఖా-కొరాట మధ్య బ్యారేజి
5. పెన్ గంగపై పంపరాడ్ వద్ద బ్యారేజి
6. లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు
పై ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను బోర్డు పర్యవేక్షిస్తుంది. ఏవైనా సందేహాలు, అనుమానాలు, సమస్యలున్నా ఈ బోర్డు సామరస్యంగా పరిష్కరిస్తుంది. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలను కూడా ఈ బోర్డు పరిగణలోకి తీసుకుంటుంది.
తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదరడం రెండు రాష్ర్ట్రాల చరిత్రలో ఓ మహత్తరమైన అధ్యాయమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ర్ట్రాలు వేరైనా అందరం మొదట భారతీయులమేనని, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ పూరిత వాతావరణంలో కాకుండా సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామని సిఎం స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి