3 నుంచి ధరణి సేవలుతహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను వచ్చే నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఏకీకృత డిజిటల్ సేవల పోర్టల్ ‘ధరణి’ని అక్టోబరు 3న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో కార్యాలయానికి ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించింది. కంప్యూటర్లు, ప్రింటర్ల సరఫరా బాధ్యతలను ఒక సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ధరణి’ సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీచేశారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోర్టల్ నిర్వహణ, ఇతర శాఖలకు అనుసంధానంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ రద్దయినప్పటికీ వారిని ఇంకా ఇతర శాఖలకు కేటాయించలేదు. వారికి ఇతర శాఖల్లో బాధ్యతలు అప్పగించే వరకు భూ సంబంధిత వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పథకాలు, సమాచార సేకరణకు వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్ట...