రాష్ట్రంలోని రిజర్వు ఫారెస్టు అంతా పచ్చని చెట్లతో కళకళలాడాలని,ప్రతి ఇంచు అటవీ భూమిని సమర్దవంతంగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో అటవీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ మిశ్రా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు, అటవీ శాఖ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం లోని హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూములున్నాయని, పేరుకు అటవీ భూములు అయినా అందులో అడవి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రిజర్వు ఫారెస్టు అన్ని భూముల్లో విరివిగా మొక్కలు పెంచాలని, రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమం కింద నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో 500 ఎకరాల విస్తీర్ణంలో కోయంబత్తూర్ తరహాలో ఫారెస్టు కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు స...