తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు రంగం
సిద్ధమవుతున్నట్లు సమాచారం. జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చిచెప్పడంతో
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులందరూ ఆమె నివాసానికి వెళ్లి జయకు శుభాకాంక్షలు
తెలిపారు. ఈసందర్భంగా జయలలిత ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీర్ సెల్వం
సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 17న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే
అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి