ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ .. సెక్షన్ 66 A ను రాజ్యాంగ కల్పించిన ప్రాధమిక హక్కు 19 (a ) భావ వ్యక్తీకరణ స్వేచ్చ కు భంగం కలిగించే విధంగా ఉందని సుప్రేం కోర్ట్ అఫ్ ఇండియా శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసు లో తీర్పు ప్రకటించింది . ఈ సెక్షన్ ను షహీన్ దాడ నుంచి మొన్నటి 12 క్లాసు స్టూడెంట్ పేస్ బుక్ పేజి ఫై పోస్ట్ లకు అరెస్ట్ చేసారు .
యూపియె ఐ టీ ఆక్ట్ 2000 కు సెక్షన్ 66a ను 2008 లో జోడించింది . సెక్షన్ 66 ఎ -కంప్యూటర్ గాని ఎ ఇతర సమాచార ఉపకరణాలతో ఇతరులను కించ పరిచే ,హాని పరిచే అభ్యంతాకర మై న సమాచారాన్ని చేరవేసిన .. బి )ఒక సమాచారం తప్పని తెస్లినప్పటికి ఇతరులకు కోపం, అసౌకర్యం ,ప్రమాదం అడ్డంకి ,కలిగించే నేరపూరిత ఉద్దేశం తో , ద్వేష భావంతో ,దురుద్దేశం తో కంప్యూటర్ ద్వారా దాన్ని ఉపయోగించిన .... సి )ఇతరులకు అసౌకర్యం కలిగించేదిలా,తప్పుదారి పట్టించే విధంగా ఈ మెయిల్ ను వాడుకున్నా .... ఈ ఆక్ట్ ప్రకారం వ్యక్తీ నేరం చేసినట్లు రుజువైతే సంవత్సరం కారాగారం విధించే అవకాశముంది .
ఈ సెక్షన్ కింద ఫేస్బుక్ పేజి లో పోస్ట్ కు మహారాష్ట్ర లోని థానే లో ఇద్దరు మహిళలను(2012),రాజ్యాంగం ఫై కార్టూన్ వేసిన త్రివేదిని,ఉత్తర ప్రదేశ్ లో ఆజం ఖాన్ కు కించ పరిచే పోస్ట్ కు 12 వ తరగతి చదువుతున్న స్టూడెంట్ ను అరెస్ట్ చేసారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి