ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తునీసియా తరహాలో హైదరాబాద్‌ అభివృద్ది

తునీసియాలో నిర్మిస్తున్న కొత్త నగరం తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. సౌది అరేబియా రాయల్‌ ఫామిలీ ప్రతినిధి డాక్టర్‌ ఫయిజ్‌ అల్‌ అబెడీన్‌ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు, కొత్త ప్రభుత్వాని ఏర్పాటు చేసి అభివృద్ది పథంలో నడుస్తున్నందుకు సౌది అరేబియా రాజు పంపిన అభినందన వర్తమానాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్బంగా ఫయిజ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఓ ఆదర్శవంతమైన లౌకిక రాష్ట్రంగా  ముందుకు పోతున్నదన్నారు. ముస్లింలకు అత్యంత ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. పునర్‌నిర్మాణ దశలో ఉన్న తెలంగాణకు సహకారం అందించాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పడం, నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వైద్య రంగంలో సహకరించడం లాంటి లక్ష్యాలు తమకు ఉన్నాయన్నారు. కొత్తగా నిర్మిస్తున్న తునీసియా నగర నమూనాను ముఖ్యమంత్రికి చూపించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటి, స్పోర్ట్స్‌ సిటి లాంటి 16 వేరు వేరు సిటీలతో నిర్మాణంలో ఉన్న తునీసియా కొత్త నగర అనిమేషన్‌ దృశ్యా...

తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ విద్యుత్ పాటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి

తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ విద్యుత్ పాటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలను కూడా పరిశీలించాలని, దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనుభవం ఉన్న గ్రీన్ కో ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి పలు ప్రతిపాదనలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 వరకు 800 మెగావాట్లకు పైగా సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తామని, ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించారు. అవసరమైన స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ తో పాటు పవన్ విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఒక దఫా సౌర విద్యుత్ కోసం టెండర్లు పిలిచామని, అవసరమైతే మరోసారి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 2 వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉన్నదని, పగటి పూట విద్యుత్ అందించే సోలార్ వ్యవస్థను వ్యవసాయ పంపుసెట్లకు అనుసంధానం చేస్తే ఉభయ తారకంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అటు పగటి పూట కరెంటు అందివ్వవచ్చని, సోలార్ విద్యుత్ ను పూర్తి స్థాయిలో వినియ...

మెదక్‌ జిల్లా సాగునీటి అవసరాలు

మంజీరా నీటిని మెదక్‌ జిల్లా సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకొనే విధంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. మంజీరా నీరు హైదరాబాద్‌ ప్రజల మంచినీటి అవసరాల కోసం వినియోగిస్తున్నందువల్ల ప్రస్తుతం మెదక్‌ జిల్లాకు సాగునీటి కొరత ఏర్పడుతున్నదన్నారు. కృష్ణా నది నీటిని హైదరాబాద్‌  తరలించి మంజీరా నీటిని మెదక్‌ జిల్లాలో వినియోగించాలన్నది తమ లక్ష్యమని సిఎం ప్రకటించారు. మంజీరా నీటిని సింగూర్‌ ప్రాజెక్టులో నిలువ చేసి ఘనపూర్‌ ఆనిక ట్‌ ద్వారా మెదక్‌ జిల్లాలో 25 వేల ఎకరాలకు నీరందించే విధంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మెదక్‌ జిల్లా పుల్చారం మండలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘనపుర్‌ ఆనికట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఘనపూర్‌ ఆనికట్‌ పైన, మంజీరా నది పొడవునా ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా ఘనపూర్‌ ఆనికట్‌పై సమీక్ష చేశారు. మంజీరా నది ద్వారా 4.06 టి.ఎం.సి. ల నీటి కేటాయింపు ఘనపూర్‌ ఆనికట్‌కు ఉందన్నారు. దీని ద్...

తెలంగాణా కొత్త మినిస్టర్స్ శాఖలు

1.  సి . లక్ష్మా రెడ్డి -ఎనర్జీ  2.  అజ్మీరా చందూలాల్ -ఎస్ టి డెవలప్మెంట్ ,టూరిజం   3.  జూపల్లి కృష్ణ రావు -ఇండస్ట్రీస్ ,హన్డ్లూం  టెక్స్టైల్స్ షుగర్  4.  తుమ్మాల నాగేశ్వర్ రావు - రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ,విమెన్ చైల్డ్ డెవలప్మెంట్  5.  ఇంద్రకరణ్ రెడ్డి -హౌసింగ్ ,లా అండ్ ఎండోమెంట్  6. తలసాని శ్రీనివాస్ యాదవ్ -కమర్షియల్ టాక్స్,సినిమాటోగ్రఫీ   అదనపు బాద్యతలు  1.  పద్మా రావు -మినిస్టర్  ఫర్  ఎక్సైజ్  అండ్ ప్రొహిబిషన్ , స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్  2.  జోగు రామన్న -మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ , బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్

తెలంగాణా ప్రబుత్వం తెలంగాణా పబ్లిక్   సర్వీస్ కమిషన్ ను ,గంట చక్రపాణి చైర్మన్ గా ,విట్టాల్  అండ్ చంద్రావతి మెంబెర్స్ గా నియమించడం జరిగింది 

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

అంతర్జాతీయ స్థాయి సినిమాసిటి, స్పోర్ట్స్‌ సిటిలు :కె.చంద్రశేఖర్‌ రావు

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమాసిటి, స్పోర్ట్స్‌ సిటిలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చెప్పారు. అందుకు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలతో కలిసి రాచకొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి సోమవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. రాచకొండ ప్రాంతంలో కాలినడకన కూడా తిరిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దాదా ... పు 31 వేల ఎకరాలకు పైగా భూమి ఈ ప్రాంతంలో ఉందని, ఇది తెలంగాణలో పలు పరిశ్రమలు, సంస్థలు, విద్యాలయాలు స్థాపించడానికి అనువైనదని చెప్పారు. కాలుష్యం వెదజల్లని సంస్థలన్నింటిని ఇక్కడే నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సినిమా సిటి,స్పోర్ట్స్‌ సిటి, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాచకొండ ప్రాంతంలో చదును ఉన్న భూమి ఎక్కువగా ఉంది, కొద్దిపాటి కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటిన్నింటిని ఉపయోగించుకొని తెలంగాణకు తలమానికంగా నిలిచే సంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర...