
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో పట్టాభి సీతారామయ్య ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ను సభ దృష్టి ముందు పెట్టారు. పట్టాభీ.. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గాంధీ మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఎగతాళిగా మాట్లాడారు. వెంటనే పట్టాభి సీతారామయ్య తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష .. ఆంగ్లంలో జాతీయ భాష హిందీలో, దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలో ఉంది. ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే అంటూ చురక వేశారు.తెలుగు మాతృ బాషా కాని వారు ఆశ్చర్యపోయారు.భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచం లో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాష లను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.
Source:Brightthinkers
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి