సాదారణంగా వర్షకాలంలో వరదలతో నాళలు పొంగి నీటి ప్రవాహంలో జనాలు కొట్లకుపొవటం కు సంబంధించిన వార్తలను చూస్తుంటాం. కానీ ఇదే వర్ష కాలం ఇంకో ప్రమాదం గురించి ఎక్కువగా ఆలోచించం అదే పిడుగు... భారీ శబ్దంతో పాటు సుమారు లక్ష నుంచి రెండు లక్షల వోల్టు లకు పైగా విద్యుత్తు...పిడుగు నేల ను తాకే సమయంలో ఉత్పత్తవుతుంది. పిడుగు తీవ్రతకు ఇంటి వస్తువులతో పాటు ఇల్లు కూడా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కనీస జాగ్రతలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా కాపాడుకునే వీలుందంటున్నారు నిపుణులు. వర్షాకాలంలో వరద బీభత్సం మే కాదు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువైతున్నాయి.
ఉత్పతాల సమయంలో ఎత్తయిన భవనా పై అంతస్తుల్లో ఉండేవారు విద్యుత్తు సరఫరా అందించే మెయిన్ స్విచ్ ను ఆపేయాసి, టీవీ, ఏసీ, ప్రజ్, వాషింగ్ మెషిన్ సహా అన్ని విద్యత్తు గృహోపరకరణాల ప్లగ్ లను స్విచ్ బోర్డు నుంచి తీసేయాలి.
సాధారణ ఇళ్ల నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకూ అన్నింటిని రాగి తీగతో ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలి.ఇంటి పై కప్పు పై రాగితో చేసిన లైటినింగ్ అరెస్టర్. లైటనింగ్ కండక్టర్ ను బిగించుకుని., వాటిని ఎర్త్ వైర్ తో అనుసంధానించాలి.ఇంపెండెంట్ ఇళ్లకు రాగి తీగతో పెరటిలో తడిగా ఉండే ప్రదేశంలో నాలుగు అడుగుల రాడ్డుతో ఎర్తింగ్ చేసుకోవాలి. ఇళ్లు భవనాలకు వెలుపలి వైపు లోహపు గొట్టాలు, నీటి పైపులు యాంటెనాలు ఉంటే వాటన్నింటనీ భూమిలోని ఎర్తింగ్ వ్యవస్థతో తప్పని సరిగా అనుసంధానించాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి