ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో SIR - Special Intensive Revision చేస్తోంది. 18 ఏళ్లు పైబడిన అందరి పేర్లు ఉండేలా మరియు అక్రమ ఓటర్లను తొలగించే ఉద్దేశ్యం.SIR ఫారం నింపిన తర్వాత మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తుంది.కాల్ చేసే వ్యక్తి తను BLO - బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చిన OTP చెప్పండి" అని అడుగుతాడు.ఒక్కసారి OTP చెప్పారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది.భోపాల్‌లో ఇలాంటి స్కామ్ ఇప్పటికే రిపోర్ట్ అయింది. మోసగాళ్లు ప్రభుత్వ అధికారుల్లా నటించి "SIR.apk" లింక్ పంపి డేటా దొంగిలిస్తున్నారు
ముఖ్య సూచన
1. ECI/BLO ఎవరూ ఫోన్‌లో OTP అడగరు
2. ఎవరికీ OTP ఇవ్వకండి
3. OTP కోసం బెదిరిస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి
.jpg0907.png)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి