ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అకాడెమిక్ 2020-21విద్యా పున op ప్రారంభానికి సంసిద్ధత

 యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ 2020-21 సంవత్సరానికి సవరించిన అకాడెమిక్ క్యాలెండర్‌ను ప్రచురించింది, దీని కింద నవంబర్ 1 నుండి మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించవచ్చు,  విద్యార్థులు వ్యక్తిగత తరగతులకు తిరిగి వచ్చిన తరువాత నాలుగు విద్యాసంస్థలు నిర్వహించిన ప్రీ-ప్రింట్‌లో యు.ఎస్ అధ్యయనం, క్యాంపస్‌లతో ఉన్న కౌంటీలకు అంటువ్యాధులు సగటు విలువ కంటే రోజుకు 3,000 పెరిగాయని తేలింది.పాఠశాల పున op ప్రారంభానికి అనుసంధానించబడిన వైరస్ కేసుల కోసం మరొక అంచనా, ఇతర పరిశోధకులు చేసిన ఈ సంఖ్య 21,000 కు పైగా ఉంది; U.S. లో కళాశాల కేసులు 88,000 మించిపోయాయి.బ్రిటన్లో, ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబరులో పాఠశాల పున op ప్రారంభానికి  సంసిద్ధతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యను అన్‌లాక్ చేయాలన్న భారతదేశం యొక్క సంక్రమణ సంభవం తగ్గినట్లు తెలుస్తుంది, అయినప్పటికీ సంపూర్ణ సంఖ్యలు భయానకంగా ఎక్కువగా ఉన్నాయి. UGC యొక్క క్యాంపస్ క్యాలెండర్ ప్రణాళిక ప్రకారం అమలు చేయబడితే, జర్మనీ, డెన్మార్క్ మరియు నార్వే వంటి దేశాలు- రాష్ట్రాల మధ్య  నిబద్ధత అవసరం:

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి అరెస్ట్

    ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం నరసింహారెడ్డికి రూ.75 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. అనంతపురంలో 55 ఎకరాలు, సైబర్ టవర్స్ దగ్గర 4 ప్లాట్లు, హఫీజ్‌పేట్‌లో G+3 భవనం, రెండు ఇళ్ళు, రూ.15 లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో ఉప్పల్ సీఐగా నరసింహారెడ్డి పని చేశారు. పలు ల్యాండ్ సెటిల్మెంట్లు,  భూ వివాదాల్లో ఏసీపీ తల దూర్చినట్లు తెలుస్తోంది. నరసింహా రెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేశారు. హైదరాబాదులో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ప్రైవేట్ ఉద్యోగుల‌కు ఈపీఎఫ్‌వో శుభ‌వార్త‌

        దేశంలోని ప్రైవేటు ఉద్యోగుల‌కు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) శుభ‌వార్త చెప్పింది. ప్రైవేటు రంగంలో ప‌నిచేసే ఉద్యోగుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్‌వో ఈ నిర్ణ‌యం తీసుకుంది. కొత్త ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఉద్యోగి ఏ రోజైతే ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతాడో అదే రోజు నుంచి పింఛ‌న్ మొదల‌వుతుంది. ఇది ప్రైవేటు రంగంలో ప‌నిచేసే ఉద్యోగుల‌కు నిజంగా ఒక వ‌రం లాంటిద‌ని ఈపీఎఫ్‌వో వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త ప‌ద్ధ‌తి ఈ నెల 30 నుంచే అమ‌ల్లోకి రానుంద‌ని ఈపీఎఫ్‌వో వెల్ల‌డించింది.  ఉద్యోగి ప‌ద‌వి విర‌మ‌ణ పొందిన త‌ర్వాత పింఛ‌న్ ప్ర‌క్రియ మొద‌లు కావాలంటే గ‌తంలో నెల‌ల త‌ర‌బ‌డి పెన్ష‌న్ ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. ఎంతో పేప‌ర్ వ‌ర్క్ ఉండేది. కానీ ఈ నెల 30 నుంచి ఇక ఆ ప‌రిస్థితి ఉండ‌దు. ఉద్యోగి రిటైర్ అయిన రోజు నుంచే ఆటోమేటిక్‌గా పెన్ష‌న్ మొద‌ల‌వుతుంది.  ‌

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.

శివారు గ్రామాలకు బస్సులు

చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. సిటీలో తిరగవు. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సిటీ బస్సులు నడపాలా వద్దా అన్న నిర్ణయం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ఆయన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

తహసీల్దారు కార్యాలయానికి రూ.10 లక్షలు- 3 నుంచి ధరణి సేవలు

3 నుంచి ధరణి సేవలుతహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను వచ్చే నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఏకీకృత డిజిటల్‌ సేవల పోర్టల్‌ ‘ధరణి’ని అక్టోబరు 3న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో కార్యాలయానికి ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించింది. కంప్యూటర్లు, ప్రింటర్ల సరఫరా బాధ్యతలను ఒక సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ధరణి’ సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీచేశారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోర్టల్‌ నిర్వహణ, ఇతర శాఖలకు అనుసంధానంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ రద్దయినప్పటికీ వారిని ఇంకా ఇతర శాఖలకు కేటాయించలేదు. వారికి ఇతర శాఖల్లో బాధ్యతలు అప్పగించే వరకు భూ సంబంధిత వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పథకాలు, సమాచార సేకరణకు వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్ట...