పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్న తరునంలో ... మోడీ సర్కార్ మరో చర్యకు పునుకొంది. నల్లధనం ఆరికట్టాలనే నిశ్చయం, నగదుతో పాటు ప్రజల వద్ద గల బంగారంకు సంబందించిన సమాచారం ఇవ్వాలని కొరుతుంది. పెద్ద నోట్ల రద్దుతో ఖగ్గుతిన్న బాఢా బాబులు బంగారం రూపంలో తన వద్దనున్న పెద్దనోట్లతో మార్పు చేసుకొవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ...ఇంటలిజెన్స్ సంస్ధలు కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో కేంద్ర ప్రభుత్వం బంగారానికి సంబందించిన సమాచారం బహిర్గతల చేయాలని సూచించింది. ఈ రోజు ప్రతిపక్షాలు నోట్ల మార్పడిపై చర్చను కొనసాగించాలని,నరేంద్రమోడీ సభకు హజరు కావలని పట్టుపట్టడంతో లోక్ సభ, రాజ్యసభ వాయిదా వేయడం జరిగింది.తర్వాత సమావేశమైన లోక్ సభ ఐటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టి, సభ అమోదం పొందంది. మూజువాణి ఓటుతో బిల్లు అమోదం పొందింది.