ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్ర బాబు నాయుడు అనుకున్నట్లే గురువారం రాజధాని ప్రకటించారు . అబిరుద్ది వికేంద్రిస్తూ అన్ని ప్రాంతాలను అబిరుద్ది చేస్తానని , దానికి సంబందించిన ప్రణాళిక రుపొందిస్తునట్లు ప్రకటించారు . అనంతపురం కు సెంట్రల్ యూనివర్సిటీ , విమాన పరికరాల కేంద్రం, పర్యాటక రంగం అబిరుద్ది,తిరుపతి శ్రీకాళహస్తిని అధ్యద్మిక కారిడార్ గా రుపొందిస్తానని ,కర్నూల్ కు విమానశ్రయం ,పత్తి అధికంగా పండే కర్నూల్, అనంతపురం,మరియు గుంటూరు జిల్లాలలో ముడి పత్తి నుంచి దారం , దుస్తులు తయారీవరకు కేంద్రీకరిస్తూ టెక్స్టైల్ క్లస్టర్ లు అబిరుద్ది చేస్తామని చెప్పారు. కడప , కర్నూల్ జిల్లాలలో సిమెంట్ పరిశ్రమలను స్థాపించటానికి ప్రయత్నాలు చేస్తామని ,విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు . కడపలో సోలార్ విండ్ పవర్, ఉర్దూ యూనివర్సిటీ ని , పుట్టపర్తిని అధ్యద్మిక నగరంగా అబిరుద్ది చేస్తామని ప్రకటించారు .