తీర్పును విజయమ్మ ముందే ఊహించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తలుపుతట్టనున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. శంకర్రావు లేఖ ఎలా ప్రజాప్రయోజన వ్యాజ్యం అయిందో విజయమ్మ పిటిషన్ ఎందుకు కాదో సామాన్యులకు అర్థంకాని విషయమని వాసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఒకే హైకోర్టులో రెండు విభిన్న తీర్పులు వెలువడ్డాయని న్యాయ నిపుణులు దీనిపై చర్చించాలన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆమె అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి