ప్రకృతి అందాలను తిలకించటానికి మనం ఊటీ,కొడైకెనాలన్ ,డెహ్రడూన్,జమ్ముకాశ్మీర్ ఇలా... వివిద ప్రాంతాలకు వెలుతాం. జలపాతాలు ఎత్తైన కొండలు... పైనుంచి జావువారుతూ జలపాతం క్రిందకి అలా...దుకుతుంటే... చుట్టుప్రక్కల పచ్చదనం..చల్లటి వాతావరణం మససును శరీరాన్ని ఉత్తేజ పరుస్తుంది. జలపాతాలను వీక్షించడానికి ఎక్కడో వెళ్లాల్సిన పనే లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలోని కుంటాల జలపాతం ,మల్లెలతీగ,భీముని పాద,బొతగ జలపాతాలు వెళితే ఆహ్లదకరమైన వాతావారణం ... ప్రకృతి రమనియతను తిలకించవచ్చు. వర్షాకాలంలో ఇవి మరింత శోభితంగా ఉంటాయి . మల్లెల తీర్థం హైదరాబాద్ నుంచి 185 కి . మీ . దూరంలో ఉన్న మల్లెల తీర్థం చేరుకోవాలంటే .. 350 మెట్లు కిందకు దిగాల్సి ఉంటుంది . అడని ప్రాంతం కావటంతో సౌకర్యాలు ఉండవు, మన వెంట అవసరమైన ఆహార పదార్థాలతో పయానం సాగాలి . అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ జలపాతం ఉద్ధృతంగా ఉంటుంది . మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో మల్లెల తీర్థం జలపాతం ఉంది . భీముని పాద వరంగల్ జిల్లా గూడురు మండలం సీతానగరంలో భీముని పా...