ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అసెంబ్లీలో సమైక్య, తెలంగాణ నినాదాలు

సభ్యుల పోటీపోటీ నిరసనల మధ్య శాసనసభ సమావేశాలు సోమవారం నాటికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు సభలో గందరగోళం నెలకొనడంతో... సహకరించాలని ఉపసభాపతితో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు సభ్యులకు పదేపదే విజ్ఞప్తి చేశారు. బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. సభ సజావుగా నడవడానికి ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు తమ సభ్యులను కూర్చోబెట్టాలని, లేకపోతే సభ నడపటం కష్టమవుతుందని వివరించారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభను సోమవారం నాటికి వాయిదా వేశారు. ఇదే పరిస్థితి కారణంగా శాసనమండలి సైతం సోమవారం నాటికి వాయిదా పండింది.
అంతకు ముందు అసెంబ్లీ అరగంట పాటు రెండు సార్లు వాయిదా పడింది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. సభ్యులు తెలంగాణ, సమైక్య నినాదాలతో గందరగోళం సృష్టించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడటంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. సభ్యుల ఆందోళనలతో శాసనమండలి సైతం ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. తెలంగాణ, సమైక్య నినాదాలతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను మరోసారి అరగంట వాయిదా వేశారు. శాసనమండలిలోనూ ఇదేరీతిలో వాయిదా వేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు