వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం తప్పదని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్ కు మొండిచేయి చూపారని, బీజేపీ భారీగా లబ్ది పొందుతుందని వెల్లడిస్తున్నాయి.
మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఢిల్లీల్లోనూ సత్తా చాటుతుందని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ 161 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ప్రస్తుత శాసనసభలో బీజేపీ బలం 143 సీట్లే కాగా... ఇది మరో 18 స్థానాలకు పెరగనుందని సర్వే పేర్కొంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 62 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. అంటే ప్రస్తుతం ఉన్న 71 మంది సభ్యుల బలం... 61కి పడిపోతుందని సీ ఓటర్ సర్వే పేర్కొంది.
మధ్యప్రదేశ్ ప్రజల్లో చౌహాన్ కు ఉన్న ఆదరణే ఆ రాష్ట్రంలో బీజేపీకి కొండంత అండగా నిలిచింది. రెండు సార్లుగా చౌహాన్ అందించిన మంచి పాలన, అభివృద్ధి కూడా బీజేపీకి లాభించిందనే చెప్పాలి. మధ్యప్రదేశ్ లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ... అది ప్రభుత్వాన్ని మార్చేంతగా లేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో అదే వెల్లడైంది. ఈ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సైతం ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అయితే అవేమీ పనిచేయలేదని... మంచి పాలనకు, అభివృద్ధికే ఓటర్లు మొగ్గు చూపారనే విషయం సీ ఓటర్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు నిజమైతే... హ్యాట్రిక్ హీరోగా చౌహాన్ కూడా మోడీ సరసన నిలుస్తారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి