ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

టీభేటీలతో హస్తినలో వేడి



వరుస టీభేటీలతో హస్తినలో విభజన వేడెక్కింది. డిసెంబర్ మూడున టీ బిల్లు కేబినెట్ ముందుకు రానున్నా కీలకాంశాలపై తర్జనభర్జన సాగుతూనే ఉంది. శీతాకాల సమావేశాల్లో టీ బిల్లు ప్రవేశపెట్టడం కష్టమని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాధ్ స్పష్టం చేసినా అగ్రనేతలు మాత్రం ఆఘమేఘాలపై టీ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. దీనిపై ప్రధాని నివాసంలో జరిగిన కోర్ భేటీలో వాడివేడి చర్చ జరిగింది.
 టెన్ జన్ పధ్, రేస్ కోర్స్ రోడ్, నార్త్ బ్లాక్...ఇలా హస్తిన అధికార కేంద్రాల్లో విభజన చర్చలు వాడివేడిగా సాగాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే టీబిల్లు ప్రవేశపెట్టేలా కేంద్ర పెద్దలు టీ ఎక్సర్ సైజ్ ను ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో శుక్రవారం ఉదయం
 దిగ్విజయ్ సింగ్ జీవోఎం నివేదికలో కీలకంగా వ్యవహరిస్తున్న జైరాం రమేష్ తో భేటీ అయ్యారు. గత జీవోఎం భేటీలో హైదరాబాద్ పై షిండేకు తనకూ ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఆ విషయాలను డిగ్గీ రాజా జైరాంతో చర్చించారు. వివాదాస్పద అంశాలపై ఇరు ప్రాంతాలను మెప్పించేలా నివేదికకు తుదిమెరుగులు దిద్దడంపై ఇరువురూ చర్చించనట్లు తెలిసింది. అయితే జైరాంతో చర్చలను తాను వెల్లడించలేనని దిగ్విజయ్ చెప్పారు.అనంతరం డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. తమకు హైదరాబాద్ తో కూడిన పదిజిల్లాల తెలంగాణ కావాలని దిగ్విజయ్ ను కోరారు. రాయల తెలంగాణకు అంగీకరించమని స్పష్టం చేశారు. మరోవైపు జీవోఎం సభ్యులు జైరాం రమేష్, షిండే అధినేత్రి సోనియానుకలిసి జీవోఎం నివేదిక వివరాలను  చర్చించారు. సాయంత్రం ప్రధాని నివాసంలో జిరిగిన కోర్ కమిటీలో పూర్తిస్ధాయిలో సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంటరీవ్యవహారాల మంత్రి కమల్ నాధ్ ప్రత్యేక ఆహ్వానితుడుగా పాల్గొన్నారు. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే టీబిల్లు ప్రవేశపెట్టాలని కోర్ కమిటీ సభ్యులు కమల్ నాధ్ కు తెలుపగా సాధ్యాసాధ్యాలపై వారు చర్చించారు. అయితే కమల్ నాద్ మాత్రం ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం ఈ సీతాకాల సమావేశాల్లో టీబిల్లు తీసుకురావడం సాధ్యం కాదని అభిప్రాయంపడినట్లు తెలుస్తోంది. దాంతో కంగుతిన్న కోర్ కమిటీ సభ్యులు ఇది పార్టీ క్రెడిటిలిటీకి సంబందించిన సమస్యఅని శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెల్టాలని దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని కమల్ నాధ్్కు సూచించారు. తర్వాత కోర్ భేటీ నుంచి వెనుదిరిగిన కమల్ నాధ్. ఈ సెషన్ లో బిల్లు పెట్టడం సాధ్యం కాదని  చెప్పారుటీ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో కేబినెట్ భేటీ 3వతేదీనే జరగాలని కోర్ కమిటీలో నిర్ణయించారు. రెండున జరిగే జీవోఎం చివరి భేటీలో జీవోఎం నివేదికకు ఆమోదముద్ర వేస్తారు. ఆ నివేదికను హోంశాఖకు అందచేస్తారు. మూడున జరిగే కేబినెట్ భేటీలోనే జీవోఎం రిపోర్ట్ను చర్చకు తీసుకురానుంది. అయితే జీవోఎం కూడా హైదరాబాద్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. హైదరాబాద్ పై రెండు మూడు ఆప్షన్లు ఉంచినట్లు సమాచారం. హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాల తెలంగాణ ఇస్తూ సీమాంధ్రుల రక్షణ కోసం శాంతిభద్రతలు, విద్యుత్ , రెవిన్యూ, విద్యాఉద్యోగ తదితర అంశాలు గవర్నర్ చేతిలో పెట్టాలని ఒక ఆప్షన్ కాగా, హైదరాబాద్ ను కనీసం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనేది మరో ఆప్షన్, ఇక రాయల తెలంగాణ అనేది చిట్టచివరి ఆప్షన్ గా జీవోఎం పేర్కొంది.  ఇక సీమాంధ్రకు ఓక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం...ఈస్ట్ కోస్ట్ లో ఉన్న వాల్తేరు జోన్ ను ఆ జోన్ లోకి తేవడంతో సహా భారీ ప్యాకేజ్ లు సీమాంధ్రకు ప్రకటించడం, 37 పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రలో కలపడం వంటి వివరాలను జీవోఎం నివేదికలో పొందుపరిచారు. మొత్తంమీద జీవోఎం సిఫార్సులపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మార్పు చేర్పులకు ఇంకా అవకాశం ఉంటుందా అనుకున్న సమయానికి పార్లమెంట్ కు బిల్లు వెళుతుందో లేదో ఇలాంటి ప్రశ్నలకు తెరపడాలంటే మరో వారం వరకూ వెయిట్ చేయాల్సిందే..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..