కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి వెల్లడి • విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాలతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయు. • మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విదేశీ విమాన సేవలు. • అమెరికా రేపటి నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నడిపేందుకు అంగీకరించాయి. • జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య 28 విమానాలను నడపనున్న ఎయిర్ ఫ్రాన్స్. • రేపటి నుంచి నుంచి జూలై 31 వరకు భారత్ – అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలను నడుపేందుకు ఒప్పందం. • జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని, “లుఫ్తాన్సా” ఎయిర్‌లైన్స్‌తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న కేంద్రమంత్రి. • విదేశీ విమాన సర్వీసుల నిర్ణయాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది