ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డిజిటల్ అరెస్ట్,రిటైర్డ్ జడ్జీనే టార్గెట్ చేసి రూ.1.66 కోట్ల టోకరా..*

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌ల పేరిట అమాయకులను ముంచేస్తున్నారు. చదువుకున్న వ్యక్తులు సైతం ఈ డిజిటల్ అరెస్ట్‌లకు బలవుతున్నారు. సైబర్ కేటుగాళ్లు ఈ సారి ఏకంగా రిటైర్డ్ జడ్జీని టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా దోచేశారు. సైబర్ మోసగాళ్లు వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని చెప్పి రిటైర్డ్ జడ్జిని భయపెట్టారు. మీపై విచారణ జరుగుతోందని, కేసు ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తూ డిజిటల్ అరెస్ట్ చేసినట్టు నటించారు. అంతేకాకుండా మీ ఆధార్‌కు లింక్ అయిన రెండు మొబైల్ నెంబర్లు మహిళలకు అభ్యంతరకర కాల్స్ చేస్తున్నాయని చెబుతూ మాజీ జడ్జిని భయభ్రాంతులకు గురిచేశారు.దర్యాప్తు కోసం మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి, మీరు చెల్లించే మొత్తం విచారణ పూర్తయ్యాక తిరిగి ఇస్తామని నమ్మబలికారు. అరెస్టు అయితే ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందనే భయంతో రిటైర్డ్ జడ్జి మొత్తంగా రూ.1.66 కోట్లు సైబర్ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. అయితే మోసగాళ్లు చెప్పినట్లుగా నగదు తిరిగి ఇవ్వకపోవడంతో మోసం జరిగినట్టు గ్రహించిన రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించారు....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు