ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

కిరణ్‌బేడీలో రాజకీయ వైరాగ్యం

  మాజీ ఐపీఎస్‌అధికారి కిరణ్‌బేడీలో రాజకీయ వైరాగ్యం కనిపిస్తోంది. ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో , బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్‌బేడీ , ఘోరమైన ఓటమిని చవి చూశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల తర్వాత జీవితం ఎలా ఉంది అన్న మీడియా ప్రశ్నకు ఆమె రాజకీయ వైరాగ్యాన్ని కనబరిచారు. తాను చురుకైన రాజకీయవేత్తనే కానని చెప్పారు. అయితే , ప్రజాసేవపట్ల అనురక్తి మాత్రం తగ్గలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికలు తనకు ముందెన్నడూ లేనంతటి అద్భుత అనుభవాన్నిచ్చాయని , తాను చేయాల్సిందేదో.. చేయకూడనిదేదో నేర్పాయని అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మళ్లీ పగ్గాలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చిచెప్పడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులందరూ ఆమె నివాసానికి వెళ్లి జయకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా జయలలిత ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీర్ సెల్వం సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 17న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.