ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

గవర్నర్ తెలుగు భాషా పట్ల ఆశక్తి

మైసూరులోని భారతీయ భాషా సంస్థ దక్షిణ ప్రాంతీయ కేంద్రంలో తెలుగు భాషా బోధనలో శిక్షణ పొందుతున్న తెలుగేతర ఉపాధ్యాయులు ఈ రోజు తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్ ను కలిశారు . 17 మంది శిక్షణ పొందుతన్న అభ్యర్ధులు శిక్షణలో భాగంగా హైదరాబాదును సందర్శిస్తున్నారు . మూడు రోజుల పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పలు కార్యక్రమాలను నిర్వహించిన తరువాత గవర్నర్ను కలిశారు . తమిళనాడు , కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపాద్యాయులు   తెలుగు   లో పొందిన ప్రావీణ్యాన్ని చూసి గవర్నర్ ఆశ్యర్యపోయారు . తాను కూడా తెలుగు నెర్చుకుంటానని రేపటి నుంచే తనకు నేర్పడానికి ఏర్పాటు చేయవలసిందిగా తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ తెలుగు కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి . సత్తి రెడ్డి గారిని ఆదేశించారు . .