ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

సర్వేలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో సర్వేలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి . అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుందని కొన్ని సర్వేలు , కాదు .. కాదు బీజేపీ గెలుస్తుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి . సర్వేల్లో నాలుగు బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని పీటీఐ వార్తాసంస్థ కథనం పేర్కొంది . బీజేపీకి 3 సీట్లు వస్తాయని ఇండియా టీవీ - సీ ఓటరు సర్వేలో , 36 సీట్లు వస్తాయని వీక్ - ఐఎంబీఆర్ సర్వేలో - ఐబీఎన్ 7 సర్వేలో తేలింది . తాజాగా వెలువడిన సర్వే ఫలితాల్లో ఏకంగా మూడు సర్వేలో ఢిల్లీలో కమల వికాసం తథ్యమని అంచనా వేశాయి . బీజేపీ 37 స్థానాలు సొంతం చేసుకుంటుందని , ఏఏపీకి 27 దక్కుతాయని ఇండియా టీవీ - సీ ఓటర్ ‌ సర్వే తెలిపింది . కాంగ్రెస్ ‌ ఏడు సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది . జీ - తలీమ్ ‌ సర్వే బీజేపీ 32 నుంచి 36 సీట్లు , ఏఏపీకి 30 నుంచి 34 దక్కుతాయని పేర్కొంది . కాంగ్రె ‌ స్ ‌ కు ఆరు మాత్రమే ఇచ్చింది . న్యూ నేషనల్ ‌ చానల్ ‌ బీజేపీకి 30-35, ఏఏపీకి 30-34, కాంగ్రెస్ ‌ కు 3-5 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది