వ్యవసాయ పనుల్లో వినియోగించే ట్రాక్టర్లు కేజ్ వీల్స్ తో అలాగే రోడ్లపైకి రావడంతో రహదారులు త్వరగా పాడవుతున్నాయని, ఇలా దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తులకు విలువైన ప్రజాధనం వృధా అవుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. కేజ్ వీల్స్ కలిగిన ట్రాక్టర్లను రోడ్లపై తిప్పకుండా ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని, ఇందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖను ఆదేశించారు.