ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

మొహర్రం- ఇస్లామ్‌ నూతన సంవత్సరం

మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ కేలండర్ ను వాడేవారు. ప్రాచీనకాలంలో ఆషూరా దినం, అనగా ముహర్రం యొక్క పదవతేదీని, అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది  రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు. క్రీ.శ. 632లో మహమ్మద్‌ ప్రవక్త (స) పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌- ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) మనవలు. హజ్రత్‌ అలీ తనయులు. హజ్రత్‌ అలీ తరువాత ప్రజలు ఇమామ్‌ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకొన్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌ మావియా. అతనిలో అధికార దాహం పెరిగింది. కత...