ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

న      2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో జులై 2 నుంచి 9వ తేదీ వరకు  విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు జరుగనున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో  శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందుకోసం విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుచేసి ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9.00 గంటలకు ఏకాంత సేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తారు. రోజువారీ కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి. ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక సేవ, ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు రెండో నివేదన చేపడతారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్...
ప్రస్తుత భారత జట్టులో డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లికి ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు అనేక మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను కోహ్లి అందిస్తూ వచ్చాడు. జట్టు ప్రతిష్టను పెంచాడు. కానీ కోహ్లిపై ఒక మచ్చ ఉంది. అదే కీలకమైన ఫైనల్‌ మ్యాచుల్లో ఆడకపోవడం. విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు ఎనిమిది ఫైనల్‌ మ్యాచులు ఆడాడు. కానీ ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ చేయలేదు. ఈ ఎనిమిది ఫైనల్‌ మ్యాచుల్లోనూ కోహ్లి బ్యాటింగ్‌ సగటు 22 మాత్రమే. అత్యంత కీలకమైన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి చేతులెత్తేశాడు. ఆమిర్‌ బౌలింగ్‌లో మొదట స్లిప్‌లో క్యాచ్‌ మిస్‌ అయి.. లైఫ్‌ దొరికినా.. దానిని కోహ్లి సద్వినియోగం చేసుకోలేదు. ఆ వెంటనే ఆమిర్‌ బౌలింగ్‌లోనే కోహ్లి పెవిలియన్‌ బాట పట్టాడు. ఫైనల్‌లో ఏమాత్రం ఆడిన ఘనత లేని కోహ్లి దాయాది పోరులో ఇంతకన్నా ఎక్కువ స్కోరు చేస్తాడని తాము ఆశించలేమని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు

అమ్మ మెరిసే మేఘం.. నాన్న నీలాకాశం.

కష్టాన్ని కళ్ల కింద దాచిపెట్టి.. సంతోషాన్ని చేతి నిండా పంచిపెట్టే విధాత నాన్న! తన కోసం ఏదీ దాచుకోవాలని అనుకోనివాడు.. త్యాగాలకు ప్రతిరూపం నాన్న! కుటుంబం కోసం తన సర్వం ధారపోసే వాడు నాన్న.. ఎంత చేసినా నాన్న అణుమాత్రంగానే ఎందుకు మిగిలిపోతున్నాడు? ఆయన మనస్సు ఎందుకు అర్థం కాదు? అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న...అమ్మ దీపంలా వెలగాలంటే.. వత్తిలా నాన్న ఉండాల్సిందే.. ఒక్కమాటలో చెప్పాలంటే తండ్రి త్యాగాల గుర్తు. అమ్మ ప్రేమ కంటి ముందుంటే.. నాన్న ప్రేమ మాత్రం గుండె లోతుల్లో ఉంటుంది. నాన్న ఏది చేసినా కుటుంబం కోసమే.. పిల్లల అభివృద్ధి కోసమే.. తన పిల్లలకు ఆయనే రోల్ మోడల్.అమ్మ మెరిసే మేఘం.. నాన్న నీలాకాశం.. నాన్నను ఎప్పుడూ మనం ఒకే కోణంలో చూస్తాం.. గంభీరంగా కనిపించే వ్యక్తిలానే చూస్తాం.. కానీ నాణానికి రెండో వైపు నాన్నని అర్థం చేసుకోవాలంటే ముందు మనకంటూ అర్థం చేసుకునే మనసు ఉండాలి..పిల్లలు యవ్వనానికి వచ్చే సరికి తండ్రికి బాధ్యతలు పెరిగిపోతాయి. కొడుకును బాగా చదివించాలి. కూతుర్ని ఓ మంచి అల్లుడి చేతిలో పెట్టాలనే తాపత్రయం ఉంటుంది.. అందుకే కొన్ని సార్లు ఆయన మనసు మనకు అంత సులువుగా అర్థం కాదు. అంత లోతైనది...

రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభం

2017-18 విద్యాసంవత్సరం ప్రారంభం రోజైన సోమవారం నాడు తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా 169 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో 119 బిసి, 50 మైనారిటీ రెసిడెన్షియల్స్ ఉన్నాయి. ఈ నెల 15న మరో 50, మరో 21 మైనారిటీ రెసిడెన్షియల్స్ 19న ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా 15 ఎస్టీ మహిళల డిగ్రీ కాలేజీలు కూడా ఇదే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నాయి. దీంతో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్స్ సంఖ్య 255కు చేరుకుంటుంది. తెలంగాణ రాకముందు ఎస్సీలకు 134 రెసిడెన్సియల్స్ ఉండేవి. తెలంగాణ వచ్చిన మరుసటి సంవత్సరమే ఎస్సీలకు 104 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ రెసిడెన్షియల్స్ ప్రారంభించారు. తెలంగాణ రాకముందు ఎస్టీలకు 94 రెసిడెన్షియల్స్ ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్టీల కోసం 51 రెసిడెన్షియల్స్ ను గతేడాది ప్రారంభించారు. ఈ ఏడాది ఎస్టీ మహిళల కోసం కొత్తగా 15 డిగ్రీ రెసిడెన్షియల్స్ త్వరలో ప్రారంభిస్తున్నారు. తెలంగాణ రాకముందు బిసిలకు కేవలం 19 రెసిడెన్షియల్స్ ఉండేవి. తెలంగాణ వచ్చిన మరుసటి ఏడాది 5 బిసి రెసిడెన్షియల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం 119 ర...

ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఘన నివాళి

ప్రముఖ కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సి. నారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఘన నివాళి అర్పించారు. మంగళవారం మద్యాహ్నం నగరంలోని సినారె ఇంటికి వెళ్లి ఆయన పార్దీవదేహంపై పుష్పగుచ్చం ఉంచి, నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులందరితో ప్రత్యేకంగా మాట్లాడారు. సినారెను బావి తరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం తరుఫున అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

ప్రత్యూష పరిస్థితి

గతేడాది ఆగస్టులో సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష ఇప్పుడు నర్సు కోర్సు చేస్తున్నది. సవతి తల్లి చేతిలో గాయపడి ఆసుపత్రి పాలైన ప్రత్యుషను అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పరామర్శించి, అక్కున చేర్చుకున్నారు. ప్రభుత్వం తరుపూనే విద్య, వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆమె కోరుకున్న విధంగా చదివిస్తున్నారు  

మోక్షం స్వర్గం

మోక్షం అంటే భగవంతుని చేరడం కాదు. ఆయనొక మనిషిలా ఎక్కడో స్వర్గంలో ఉంటాడు. ఆయనను చేరుకుంటే మనకు మోక్షం కలుగుతుందని అనాది నుండి మనిషి భావన. శక్తిహీనమైన శరీరం, మనస్సు ఆ స్థాయి నుండి అంచెలంచెలుగా శక్తిని పెంచుకుని, రెండూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని 100% కలిగి ఉండడమే మోక్షం. భగవంతుడు నిరాకారుడు. ఆయన ఒక శక్తి. ఆ శక్తికి ప్రేమ,  సహనం, ఓర్పు, దయ, జాలి,  శాంతి మొదలగు లక్షణాలు ఉన్నాయి.  ఆలాగే ప్రతి ప్రాణిలో కూడా ఈ లక్షణాలుంటాయి. ఈ లక్షణాలను వ్యక్తి కోల్పోవడం వలన సామాన్యుడయ్యాడు. అదే వ్యక్తి తిరిగి ఆ లక్షణాలను పూర్తి స్థాయిలో పెంచుకొని జీవించడమే మోక్షం. ఈ లక్షణాలు పరిపూర్ణంగా పెరిగిన వ్యక్తి, దేహంతో ఉన్నపుడు చేసే ప్రతి పని విజయాన్ని పొందుతుంది. ఆ విజయమే మోక్షం. ప్రతి విషయంలోనూ స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆ అవగాహనే మోక్షం. కోరికలను అనుభవించకున్నా, వాటి వలన కలిగే తృప్తిని అనంతంగా కలిగి ఉంటాడు. అదే మోక్షం. చుట్టూ అనేక సమస్యలు చుట్టిముట్టి ఉన్నా ఏమాత్రం చలించకుండా ఉత్సాహాన్ని , ఉల్లాసాన్శి కలిగి ఉంటాడు. అదే నిజమైన మోక్షం. భగవంతుడు ఎలా నిరాకారంగా ఉండి, పై లక్షణాలు మాత్రమే కలిగి ఉన్నాడో అల...