ఉప ఎన్నికల ఫలితాల ఫై వివిధ పార్టీలు బిన్నంగా స్పందించాయి.ఎన్ని కుట్రలు చేసిన , ఎన్ని ప్రలోభాలు పెట్టిన, గుండాయిజం చేసిన దేనికి తెలంగాణా ప్రజలు లొంగకుండా టి ఆర్ ఎస్ అభ్యర్ధి బిక్షపతిని ఎన్నుకొని తెలంగాణా సెంటిమెంట్ జగన్ సెంటిమెంట్ కంటె ఎక్కువుందని నిరుపించారని,బీజే పీని డిపాజిట్ లేకుండా చేసారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇది దేవుడిచ్చిన తీర్పుగా వై ఎస్ జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యానించారు.ఇటు చంద్ర బాబు నాయుడు జగన్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల కారణంగా వై.ఎస్.ఆర్. విజయం సాధించిందని ఈ ఫలితాలను విశ్లేశుకున్టమని చెప్పారు. అటు కాంగ్రెస్ ఛీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తమకన్నా తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిందని జగన్ అరెస్ట్ తర్వాత జనంలో విజయమ్మ సానుభూతి కోసం ప్రయత్నిచారని చెప్పారు